![]() |
![]() |

"డాన్స్ ఐకాన్" టెలివిజన్ హిస్టరీలో నిజంగా ఒక ఐకాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పెర్ఫార్మెన్సెస్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంత టాలెంటెడ్ కంటెస్టెంట్స్ ఈ షోలో ఉన్నారు. ఇక ఇప్పుడు దీపావళి పండగ వస్తున్న సందర్భంగా ఈ షోకి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. "డేర్ టు డాన్స్" కాన్సెప్ట్ తో ఈ పెర్ఫార్మెన్స్ లు నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి. ఐతే ఈసారి ఈ షోకి రమ్యకృష్ణ, శ్రీముఖి, మోనాల్ ముగ్గురు అందంగా పట్టుచీరల్లో దేవతల్లా వచ్చారు. ఇక ఇటు శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్ ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఇక రమ్యకృష్ణను చూసి "పైనుంచి దేవతలు దిగితే ఎలా ఉంటారో అలా ఉన్నారు మీరు" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక తర్వాత "ఉండిపోరాదే" అనే పాటకు యష్ మాస్టర్ రమ్యకృష్ణతో కలిసి డాన్స్ చేసాడు.
ఇక శ్రీముఖి మేల్ జడ్జెస్ ని చూసి "అందం అబ్బాయైతే నీలా ఉందే..అన్నట్టుందే" అని పాడింది. రాజు-అసిఫ్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా ఇపోయారు. "కొరియోగ్రాఫర్ లా చేయలేదు హీరోలా చేసావ్" అని శేఖర్ మాస్టర్ రాజుకి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక తర్వాత మోనాల్ శ్రీముఖి మధ్యన యష్ మాస్టర్ నిలబడి "పల్సర్ బైక్" సాంగ్ కి డాన్స్ చేశారు. "శ్రీ సూపర్ గా చేసావ్ డాన్స్" అని శ్రీముఖికి కాంప్లిమెంట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. ఇక రాయచూర్ ఆనంద్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. రమ్యకృష్ణకు ఎంతో బాగా నచ్చేసింది. "రాయచూర్ ఆనంద్ వచ్చి డాన్స్ చేస్తున్నట్టు లేదు ఆ హనుమంతులు వారే వచ్చి డాన్స్ చేసినట్టు ఉంది" అని యాంకర్ ఓంకార్ అన్నారు.
![]() |
![]() |